Radhe Krishna

Hola fam. Team "Yours Lovingly" is here with a special post for all those who love to read telugu literature and novels. 

The epic love story of Radha and Krishna is still very inspiring to the people. We all love this Gopi and Gopika's story since childhood. They taught us that love should be sacrificing and selfless. Here's a small story when Krishna shrieked of pain on his forehead and asked the other Gopikas to step on his forehead to get a relief. But they all hesitated and told him that he is a god and it would be a sin to do what he said. Then Radha appeared and Krishna told her the same as the other girls. She didn't hesitate for a second. She did what he said. When the other girls asked her if she's not afraid of going to hell for her actions and suffering. She replied, ‘My love was in pain and that’s all matters for me. I am ready to face the never-ending pain in the hell if it gives him relief for even a second’. Lord Krishna smiled back at the Gopis and said, ‘She is the true love of my life!’ 

So, as a tribute to their ever lasting love, we came up with this post. Enjoy reading and we welcome your opinions.



                                        వాస్తవంలోనూ కవ్వించే మనోహర స్వప్నానివా

కలలోనూ బాధించే మధుర, క్రూర వాస్తవానివా 

మైమరపించే సుందర రూపనివా

మదిని నొప్పించే తియ్యని తాపానివా 

నీవుంటే వెయ్యి హరివిల్లుల మయం ఈ లోకం

నీవు లేని ఉదయమూ అంధకారమయమే, వినుమా నా శోకం

ప్రతినిత్యము నీ తలుపులే,  అనుక్షణం నీ ధ్యానమే

మోయలేనంది నా హృదయం,  తాళలేని ఈ విరహం

నీ కొఱకు పడుతున్న తపనయే నను బ్రతికించు ఆధారం

నా ఈ కన్నీరవుతోంది విరహ దాహాన్ని తీర్చు జలం

ఓపలేని ఈ బాధతో, తీరని తృష్ణతో, నిన్ను కాన వచ్చాను

నా తనువును, మనసును సమర్పణమనిపించాను ,

కానవా మాధవా, కానరావా మదనమోహనా

నను నీ రాధగా మలుచుకో రాధేశా

ద్వేషమే లేని నీ గుండెలో నను నిలుపుకోనుమా అవ్యుక్తా 

నీ ప్రేమ దేశపు యువరాణిగా, నీ పట్టమహిషిగా

మురారి, నీ మురళిలో పాటగా, నీ అల్లరిలో చిలిపితనముగా దాగిపోనా

నీ సంతోషసమయంలో నీ చిరునవ్వుగా,

నీ శోకంలో కన్నీరుగా నేను నీ తోడు రానా ,

నిన్ను తలచినపుడు నా చెవుల్లో స్పష్టంగా ధ్వనించు నా ఈ గుండె చప్పుడు

నీ హృదయ స్పందనతో కలసిపోవు మార్గమే చూపవా

పాపపు విరహాముని కొని, పుణ్య సుఖాలతో

నను ధన్యురాలిని చేయ రావా

నీ కొఱకే నే వేచియున్న, నీవే నా ప్రాణమన్నా

దయ చూడవా కృష్ణా…


---Written by Kautilya Makaelson


Comments

You may also like

Nationality: - Refugee

Addiction: I take over you...

Toxic love --- Poem by Naveen Vanguri